![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -342 లో.. ముకుంద లేవకముందే తన దగ్గరికి కృష్ణ వచ్చి ఉంటుంది. ఇక ముకుంద లేవగానే టాబ్లెట్ వేసుకోమని ఇస్తుంది. నన్ను ఎందుకు బతికించావంటూ ముకుంద కోపంగా మాట్లాడుతుంది. నేను బ్రతికేది మురారి కోసమని కృష్ణకి ముకుంద చెప్తుంది. మళ్ళీ ఎప్పటిలాగే మురారి నాకే సొంతమని ముకుంద మాట్లాడగా... తను నా ఏసీపీ సర్ అంటూ కృష్ణ మాట్లాడుతుంది.
మరొకవైపు కృష్ణ ఇంట్లో కన్పించడం లేదు. ఎక్కడకు వెళ్ళిందని శకుంతల కంగారుపడుతుంది. అప్పుడే అటుగా వెళ్తున్న రేవతిని పిలిచి కృష్ణ కన్పించడం లేదని చెప్తుంది. మా ఇంట్లో ఉండి ఉంటుంది. నువ్వు కంగారు పడకని రేవతి చెప్తుంది భవాని గారు తీసుకున్న నిర్ణయానికి మీరు అయినా అడ్డు చెప్పచ్చు కదా అని శకుంతల అడుగగా.. నేను అడగలేనని రేవతి అంటుంది. నేను వెళ్లి వదిన కాళ్ళపై పడి బ్రతిమాలుతానని శకుంతల అనగానే.. వద్దు, నిజంగానే తప్పు చేశారేమో అందుకే క్షమించమని అడుగుతున్నారని అనుకుంటుంది. నా కొడుకు మీరే తప్పు చెయ్యలేదని నిరూపిస్తాడని రేవతి చెప్తుంది. మరొక వైపు కృష్ణ ఫోటోలని మురారి చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అప్పుడే కృష్ణ వస్తుంది. కాసేపు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. అ తర్వాత మురారి స్నానానికి వెళ్లి వస్తాడు. మురారి తలని కృష్ణ తుడుస్తుంటుంది. నిన్ను ఎప్పుడు ఇలాగే చూస్తూ ఉండాలని అనిపిస్తుందని మురారి అంటాడు. మరొకవైపు ముకుంద లేచిందా అని ఇంట్లో వాళ్లని భవాని అడుగుతుంది. అందరు మౌనంగా ఉంటారు. అప్పుడే ముకుంద వచ్చి వాళ్ళెందుకు పట్టించుకుంటారని అంటుంది. ఇంకా అలా ముకుంద అనగానే భవాని అందరిపై సీరియస్ గా మాట్లాడుతుంది. ముకుందకి సపోర్ట్ గా భవాని మాట్లాడేసరికి ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత కృష్ణ, మురారి లు సరదాగా మాట్లాడుకుంటూ మేడ పైనుండి కిందకి వస్తుంటారు. భవాని దగ్గరికి మురారి వచ్చి డ్యూటీలో జాయిన్ అవుతున్నానని ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇప్పుడు కృష్ణ వాళ్ళ చిన్నాన్నని కలిసి, ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్ళాలని భవానికి చెప్పి.. కృష్ణతో కలిసి మురారి బయల్దేరి వెళ్తాడు. ఇప్పుడు మురారి అక్కడకి వెళ్తే మొత్తం తెలిసిపోతుందని ముకుంద టెన్షన్ పడుతుంది. తరువాయి భాగంలో కృష్ణ మురారి ఇద్దరు జైల్ కి వెళ్లి కృష్ణ వాళ్ళ చిన్నాన్నని కలిసి మాట్లాడతారు. మరొకవైపు ముకుంద జైలుకి వెళ్లి తన అన్నయ్యని కలిసి మాట్లాడుతుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |